గవర్నర్‌ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్కంఠగా రాజకీయం
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా లోక్‌భవన్‌కు వెళ్లనున్నారు. మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ పంపిన సిఫారసు లేఖపై గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాతో ఆయన భేటీ కానున్నారు. కొండా సురేఖ రేవంత్ రెడ్డి తనను బ్లాక్‌మెయిల్ చేశారంటూ సంచలన కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.