విజయవాడ ఇంద్రకీలాద్రికి రాష్ట్రపతి రాక: ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం

రిపోర్టర్: రాము స్థలం: విజయవాడ

విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ నెల పద్నాలుగో తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన స్వయంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.