సిల్వర్స్టోన్ రేస్ ప్రారంభించనున్న సీఎం విజయ్
రిపోర్టర్: గోపి
స్థలం: తమిళనాడు
ఇంగ్లాండ్‌లోని సిల్వర్స్టోన్ సర్క్యూట్‌లో జరగనున్న మిచెలిన్ లీ మాన్స్ కప్ కార్ రేసింగ్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. యూకేలో పోటీపడుతున్న భారతీయ డ్రైవర్లకు మద్దతుగా నిలిచే ఈ రేసును సీఎం విజయ్ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రముఖ నటుడు అజిత్ కుమార్, నారాయణ్ కార్తికేయన్ బరిలో దిగుతున్నారు.