చీపురుపల్లిలో వైభవంగా దసరా ఉత్సవాలు: బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం
రిపోర్టర్: సురేష్
స్థలం: చీపురుపల్లి
చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని వెల్లడించారు. ఆలయంలో చండీహోమం, సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించామన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కమిటీ ఛైర్మన్ గవిడి నాగరాజు, ఈవో ఎస్.నానాజీబాబు పేర్కొన్నారు.