ఆపదలో ఉన్న కుటుంబానికి ఆసరాగా నిలిచిన గల్ఫ్ కార్మికుల సమితి

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన తుడుం ఇందూర్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కవ్వాల్ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆదుకుంది. శుక్రవారం బాధిత కుటుంబానికి పది వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే తమ సమితి ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ప్రతినిధులు స్పష్టం చేశారు. సాయం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు సభ్యులకు తమ కృతజ్ఞతలు తెలిపారు.