ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటర్ల జాబితాలో భారీగా తగ్గిన పేర్లు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: புது தில்லி
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్ లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపుర్ రాష్ట్రాల్ లో సర్ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఓటర్ల సంఖ్య గరిష్టంగా 13.24 శాతం మేర తగ్గినట్లు అధికారులు తెలిపారు. సర్ కు ముందు ఈ ఐదు రాష్ట్రాల్ లో 18.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 16.43 కోట్లకు పడిపోయిందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.