రాష్ట్రంలో యూఎల్సీ, ఇరవై రెండు ఏ భూ సమస్యలకు మోక్షం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మెమో జారీ చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం విఫలమైనప్పటికీ తాము స్పందించి అర్హమైన కేసులను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు ఇరవై రెండు ఏ భూ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో పరిష్కరిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.