'పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ పనులు త్వరితగతిన ప్రారంభించండి': AP CM Office ఆదేశం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన ప్రారంభించాలని AP CM Office ఆదేశించారు. ఈ రిఫైనరీ సమీపంలోనే అత్యాధునిక హంగులతో ప్రత్యేకంగా పెట్రో కెమికల్ పార్కును కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పనులను వేగవంతం చేసి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.