రుయా ఆసుపత్రి సిబ్బందికి నైతిక విలువలపై అవగాహన సదస్సు
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి
తిరుపతి రుయా ఆసుపత్రిలో జేసీఐ ఇండియా అల్యూమ్ని క్లబ్ ఆధ్వర్యంలో సిబ్బందికి నైతిక విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై రోగుల పట్ల సిబ్బంది ప్రదర్శించాల్సిన బాధ్యత, మర్యాదపూర్వక నడవడిక గురించి వివరించారు. ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావడంలో సిబ్బంది పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.