ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడే సీపీఆర్ శిక్షణ

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి

తిరుపతిలో జేసీఐ ఇండియా అల్యూమ్ని క్లబ్ ఆధ్వర్యంలో సీపీఆర్ (CPR) శిక్షణా తరగతులు నిర్వహించారు. కపిలతీర్థం రోడ్డులోని గోనివాస్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నశేఖర్ పాల్గొని, గుండెపోటు వంటి అత్యవసర సమయాల్లో ప్రాథమిక చికిత్స అందించే విధానాన్ని వివరించారు. ఆర్యవైశ్య సభ్యులకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా మారింది. ఆపదలో ఉన్నవారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవాలని నిర్వాహకులు కోరారు.