స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు: మంత్రి కొండపల్లి

రిపోర్టర్: B RAJESH స్థలం: బొబ్బిలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పాతిక శాతం మేర రిజర్వేషన్లు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ సర్కార్ కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వెనకడుగు వేయకుండా బీసీ వర్గాలకు న్యాయం చేసేందుకు అవసరమైతే ఉన్నత కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.