ఢిల్లీ వారణాసి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: విజయ్
స్థలం: New Delhi
భారతదేశంలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వారణాసి బుల్లెట్ రైలు కారిడార్‌కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి వారణాసి మధ్య ప్రయాణ సమయం కేవలం మూడున్నర గంటలకు తగ్గిపోతుందని, టికెట్ ధరలు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన శనివారం స్పష్టం చేశారు.