టెలివిజన్ రంగంలోకి రీఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత
రిపోర్టర్: కిరణ్
స్థలం: చెన్నై
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్ కార్యక్రమంలో ఆమె భాగం కానుండగా, దీనికి సంబంధించిన షూటింగ్ నిమిత్తం ఆమె చెన్నైకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా లేక న్యాయనిర్ణేతగా కనిపిస్తారా అనేదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.