ఆంధ్రప్రదేశ్ కు రూ.304 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు
రిపోర్టర్: గోపి
స్థలం: Andhra Pradesh
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా కొప్పర్తి పారిశ్రామిక వాడను కలుపుతూ నిర్మించనున్న నాలుగు లైనాల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.304.44 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడి, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసినట్టవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.