టెక్ ప్రపంచంలో సంచలనం: త్వరలో రానున్న కొత్త ఫోల్డబుల్ ఐఫోన్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్ తదుపరి వెర్షన్ తయారీపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బ్లూమ్బెర్గ్ నిపుణుడు మార్క్ గుర్మన్ తెలిపారు. రాబోయే కొత్త మోడళ్లలో ఫేస్ ఐడీ సెన్సార్లతో పాటు మరింత మెరుగైన కెమెరా వ్యవస్థను తీసుకువచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ మార్పులపై సంస్థ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో ఇవి ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నట్లు టెక్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.