డీజే శబ్దాల ధాటికి స్కూల్లోనే మృతి చెందిన చిన్నారి
రిపోర్టర్: శివ
స్థలం: బలరాంపూర్
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో తీవ్ర శబ్ద కాలుష్యం కారణంగా ఎనిమిదేళ్ల పసిపాప వైష్ణవి తివారీ ప్రాణాలు కోల్పోయింది. పాఠశాల గదిలో తరగతులు జరుగుతుండగా బయట గణేష్ నిమజ్జన ఊరేగింపులో మోగించిన డీజే లౌడ్‌స్పీకర్ల భయంకరమైన శబ్దాలకు ఆ చిన్నారి తీవ్ర అసౌకర్యానికి గురై బెంచ్ పైనుంచి కింద పడిపోయింది. ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.