వంశధార పరివాహక ప్రాంతంలో తగ్గిన వర్షపాతం కొనసాగుతున్న వరద ప్రవాహం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీకాకుళం
వంశధార నది పరివాహక ప్రాంతాల్లో గత ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం గణనీయంగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు సగటు వర్షపాతం ఎనిమిది మిమీగా నమోదైందని తెలిపారు. అత్యధికంగా మహేంద్రగడలో ఇరవై మూడు మిమీ వర్షం కురిసిందని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గినప్పటికీ నదిలో వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.