పాలకొల్లు విద్యార్థులకు సేవ: సిఎస్ఆర్ నిధులతో ఉచితంగా పాఠశాల నోట్బుక్స్ పంపిణీ

రిపోర్టర్: గోపి స్థలం: పశ్చిమ గోదావరి

పాలకొల్లు అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెల్లడించారు. పాలకొల్లులోని బ్రాడీపేట అల్లు వెంకట సత్యనారాయణ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థిని విద్యార్థులకు పూలపల్లి సంధ్య మెరైన్స్ వారి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఉచితంగా నోట్బుక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.