కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: మహారాష్ట్ర

పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. బిల్డర్ కేతన్‌ను లోహగడ్ కోటపై నుంచి తోసి హత్య చేసిన ఘటనలో మరో నిందితుడు రితేష్ హాంగేను పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా తొలగించిన సందేశాలను పునరుద్ధరించి కుట్ర కోణాన్ని పోలీసులు వెలికితీశారు.