డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంలో డేవిడ్ థామస్‌గా నటిస్తున్న ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అంతరిక్షంలోకి వెళ్లాలనే ఒక యువతి కల సాకార ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తుండగా, అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.