విజయనగరం జడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి ఎంపికపై వైసీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి ఎవరనే అంశంపై వైసీపీలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషను గతంలో అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ, మజ్జి శ్రీనివాసరావు రాజీనామా మరియు ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత అభ్యర్థిత్వంపై స్పష్టత కొరవడింది. అనూషకు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడంతో, విజయనగరం జడ్పీ పీఠాన్ని ఎవరికి కేటాయిస్తారనే దానిపై పార్టీలో మరియు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.