ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు త్వరలో రాయితీ ధరకే స్టీల్ అందజేత

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులకు త్వరలో రాయితీ ధరకే స్టీల్ అందించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే సిమెంట్ బస్తా రూ.230కే ఇస్తుండగా, దసరా నాటికి మొదటి విడత కింద మంజూరైన ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో విడత ఇళ్ల మంజూరు ప్రక్రియ ఈ నెల 20లోగా పూర్తి కానుంది.