అమరావతిలో శాప్ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
అమరావతిలోని శాప్ కార్యాలయం వద్ద వైకాపా శ్రేణులు, రౌడీషీటర్లు తీవ్ర దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఉపాధ్యాయులపై కర్రలతో దాడి చేసి బూతులతో వీరంగం సృష్టించారు. మూడు గంటల పాటు బందర్ రోడ్డులో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.