భారతీయ క్లయింట్లతో వ్యాపారం కష్టమంటూ చైనా వ్యాపారి సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

భారతీయ క్లయింట్లతో వ్యాపారం చేయడం కష్టంతో కూడుకున్నదని చైనా ఎలక్ట్రానిక్స్ వ్యాపారి జే చెన్ వెల్లడించారు. ధరల విషయంలో తీవ్రమైన చర్చలు జరపడం, మోసపూరిత ధోరణులు ఉండవచ్చనే అభద్రత వంటి కారణాల వల్లే భారతీయ కస్టమర్లతో పనిచేయడం సవాల్గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే తన అంతర్జాతీయ వ్యాపారానికి తొలి ఆర్డర్ ఇచ్చింది భారతీయుడేనని, ఆ కృతజ్ఞతను తాను ఎప్పటికీ మరచిపోలేనని ఆయన స్పష్టం చేశారు.