విజయవాడ ఇంద్రకీలాద్రి: మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
రిపోర్టర్: విజయ్
స్థలం: విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం దుర్గమ్మ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణకు త్రిశక్తి స్వరూపిణిగా చండీ అమ్మవారు అవతరించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంశల సంయుక్త స్వరూపమైన అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.