విజయనగరం అభివృద్ధిపై ఈనాడు ఈటీవీ చర్చావేదిక: ప్రజా సమస్యలపై మేధావుల గళం
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో విజయనగరంలో నిర్వహించిన చర్చావేదికలో వివిధ రంగాల ప్రముఖులు నగర సమస్యలపై స్పందించారు. మంచినీటి కొరత, ట్రాఫిక్ ఇక్కట్లు, మురుగునీటి సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక అడుగులు పడాలని వారు డిమాండ్ చేశారు. గురజాడ గ్రంథాలయ అభివృద్ధి, జీజీహెచ్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రముఖులు, మేధావులు కోరారు.