తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు ఆదాయం: తొమ్మిది నెలల్లో రూ.1,129 కోట్లు

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుమల

గత తొమ్మిది నెలల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి హుండీకి రికార్డు స్థాయిలో రూ.1,129.04 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. దేశవిదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు సమర్పించిన కానుకలతో జూలై నెలలో అత్యధికంగా రూ.140.25 కోట్ల ఆదాయం నమోదైందని, భక్తుల రద్దీకి తగినట్లుగా పారదర్శక ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ స్పష్టం చేసింది.