'ఇక్కడ తింటే నేరుగా ఆసుపత్రిపాలే': హైదరాబాద్‌లో హోటళ్ల లైసెన్సులు రద్దు చేసిన టీజీ సేఫ్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం ప్రాంతాల్లో టీజీ సేఫ్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో హోటళ్లలో తీవ్ర నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్న గెలాక్సీ కేఫ్, అంటెరా, లక్కీ రెస్టారెంట్, జాయింట్ ఆల్‌మండి, విజయ రాఘవేంద్ర సహా తొమ్మిది హోటళ్ల లైసెన్సులను అధికారులు తక్షణమే రద్దు చేసి, వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.