పులిచింతల ప్రాజెక్టు పరిశీలన: మునగాలలో సెంట్రలైజ్డ్ కిచెన్‌కు శంకుస్థాపన చేసిన మంత్రులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పులిచింతల పవర్ ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్షించారు. మునగాల మండలం ఎస్ఎం పేట వద్ద రూ.9.61 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన రాష్ట్ర తొలి గ్రీన్‌ఫీల్డ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు వారు శంకుస్థాపన చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నర్సింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.