జాతీయ క్రికెట్ అకాడమీ వైఫల్యాలపై రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: బెంగళూరు

భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆటగాళ్ల గాయాల నిర్వహణలో జవాబుదారీతనం కొరవడిందని, సెలెక్షన్ కమిటీకి మెడికల్ టీమ్‌కు మధ్య సమన్వయం లేదని ఆయన ఆరోపించారు. వరుణ్ చక్రవర్తి ఉదాహరణను ప్రస్తావిస్తూ ఎన్సీఏ నిర్వహణలో లోపాలున్నాయని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటగాళ్లు కూడా తమ ఫిట్‌నెస్ శిక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.