హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించాలని సీఎం స్పష్టం చేశారు.