రూపాయి రెండు వేలకు పైగా ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులు బంద్
రిపోర్టర్: మహేష్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లో రూ.2,000కు మించిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ చెల్లింపులను నిలిపివేయాలని పెట్రోల్ పంప్ డీలర్లు నిర్ణయించారు. అక్టోబర్ 15 నుంచి కొత్త మెర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానం అమల్లోకి రానుండటంతో, దాదాపు 4,700 పెట్రోల్ పంపులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న డీలర్లు, పెట్రోల్ పంపులను ఎండీఆర్ నుంచి పూర్తిగా మినహాయించాలని కేంద్రాన్ని కోరుతున్నారు.