స్వయంప్రతిపత్త కళాశాలల ఫీజులపై సమీక్ష: ఉన్నత విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్ ఆదేశాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: ముంబై
స్వయంప్రతిపత్త కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిపై సమీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిందని అధికారులు తెలిపారు. సాధారణ కోర్సులతో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఉన్నత విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్ పాటిల్, నిబంధనలకు అనుగుణంగా ఫీజుల వశూలు తీరును పరిశీలించాలని ఉన్నత విద్యా శాఖ డైరెక్టర్ శైలేంద్ర దేవలంకర్ ను ఆదేశించారు.