మురసు తుపాను ముప్పు: పంటల బీమాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

విపత్తుల వేళ రైతులకు పంటల బీమా అండగా నిలవాలని, ప్రభుత్వ ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో వ్యవసాయ శాఖ అధికారులు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, మురసు తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు త్వరితగతిన అంచనాలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఎవరూ నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.