కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరశంఖం, రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రజాగ్రహం తీవ్రరూపం దాల్చింది. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, రైతుల సమస్యలపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. కేసీఆర్ హెచ్చరికలు, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామాలకు తెరలేపింది. అసెంబ్లీలో విపక్ష సభ్యులను అడ్డుకుంటూ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.