ధాన్యం నిల్వపై పౌరసరఫరాల శాఖ కొత్త విధానమన్న అధికారుల స్పష్టత

రిపోర్టర్: సతీష్ స్థలం: హుజూరాబాద్

హుజూరాబాద్‌లో రబీ సీజన్ ధాన్యం సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. మిల్లర్లకు నేరుగా కేటాయించకుండా ప్రభుత్వ గోదాములు, ఫంక్షన్ హాళ్లలో ధాన్యం నిల్వ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. గతంలో పక్కదారి పట్టే అవకాశం ఉండటంతో, ఈసారి ప్రభుత్వమే ధాన్యం భద్రపరుస్తూ యాప్ ద్వారా లైవ్ ట్రాకింగ్ పద్ధతిని అమలు చేస్తోందని అధికారులు తెలిపారు.