రామ్ పోతినేని దర్శకత్వంలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

రామ్ పోతినేని హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ‘RAPO 23’ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.