ఆదివాసి యువతకు ఐటీడీఏల ద్వారానే ఉద్యోగాలు భర్తీ చేయాలి
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలకు లోబడి ఐటీడీఏ ఆధ్వర్యంలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టవద్దని ఆయన స్పష్టం చేశారు. పేద ఆదివాసి ప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి మళ్లీ అధికారులే వాటిని అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.