వైద్యుడి నిర్లక్ష్యంతో కడుపు కోల్పోయానంటూ వెస్ట్ లైఫ్ గాయకుడు మార్క్ ఫిహిల్లీ దావా
రిపోర్టర్: రాము
స్థలం: London
బరువు తగ్గేందుకు చేసిన శస్త్రచికిత్స వికటించి తన జీర్ణాశయం పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ప్రముఖ పాప్ గాయకుడు మార్క్ ఫిహిల్లీ పేర్కొన్నారు. ఇంగ్లాండ్కు చెందిన సర్జన్ నిక్ కార్టర్ నిర్లక్ష్యం వల్లే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయని, సెప్సిస్ బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడినట్లు ఆయన కోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో వెల్లడించారు. ఈ వైద్య తప్పిదంపై న్యాయపోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.