ఆహార భద్రత గాలికి వదిలిన హోటళ్లపై అధికారుల కొరడా
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ ఇన్చార్జి అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి నేతృత్వంలో హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ద్వారక మరియు బాబా రామ్‌దేవ్ హోటళ్లలో పాడైపోయిన, కాలం చెల్లిన సుమారు 175 కిలోల ఆహార పదార్థాలను గుర్తించి ధ్వంసం చేశారు. లైసెన్సులు లేకపోవడం, తీవ్ర పారిశుధ్య లోపాలు ఉండటంతో బాబా రామ్‌దేవ్ హోటల్ వ్యాపారాన్ని తాత్కాలికంగా నిలిపివేయించి, పలు నమూనాలను ప్రయోగశాలకు పంపించారు.