విజయనగరం జిల్లాలో బొత్స బంధువుకు షాక్: నామపత్రం తిరస్కరణ

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయనగరం

శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు చైతన్యబాబు నామపత్రం తిరస్కరణకు గురైంది. పూసపాటిరేగ స్థానానికి వైకాపా తరఫున ఆయన నామినేషన్ వేశారు. అయితే గ్రామీణంలో ఓటు లేదంటూ జనసేన ఫిర్యాదు చేయడంతో అధికారులు తిరస్కరించారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోగా, నోటిఫికేషన్ సమయానికి ఓటు బదిలీ కాకపోవడంతో పరిశీలించలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన జడ్పీటీసీ బరిలో నిలిచే అవకాశం కోల్పోయినట్లు స్పష్టమైంది.