ఐక్యరాజ్యసమితిలో వాకౌట్ల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటు ప్రసంగం

రిపోర్టర్: రాము స్థలం: న్యూయార్క్

న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రసంగం సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో వివిధ దేశాల ప్రతినిధులు సభ నుంచి వాకౌట్ చేశారు. పశ్చిమాసియాలో తాము చేపట్టిన సైనిక చర్యలను నెతన్యాహు గట్టిగా సమర్థించుకున్నారు. శత్రు దేశాలతో పోరాటం ఆగదని, తాము గెలవబోతున్నామని స్పష్టం చేశారు. గాజాలో ఊచకోత జరుగుతుందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.