దివ్యాంగుడి ఆధార్‌తో 16 విద్యుత్తు మీటర్లు నమోదు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెంకు చెందిన దివ్యాంగుడు బాలినేని మనోజ్‌బాబు పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా, అతని ఆధార్ నంబర్‌పై శ్రీకాకుళం, కాకినాడ, విశాఖపట్నంలో 16 విద్యుత్తు మీటర్లు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపించింది. దీంతో ఆందోళన చెందుతున్న బాధితుడు తనకు సంబంధంలేని ఆ కనెక్షన్లను తొలగించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు.