కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్న కొండా మురళి

రిపోర్టర్: మహేష్ స్థలం: వరంగల్

కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని వరంగల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో తెలిపారు. తాను కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. తన శరీరంలో ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయని, కార్యకర్తల ఆశీస్సులే తనను బతికిస్తున్నాయని ఉద్వేగంగా చెప్పారు. వరంగల్ తూర్పు బాధ్యతలను నవిన్ రాజ్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.