విమాన ప్రమాదం కలకలం: ఇళ్లపై పడిన శకలాలు, వణికిపోయిన స్థానికులు

రిపోర్టర్: నరేష్ స్థలం: Florida

అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర విమాన ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రయాణంలో ఉన్న లీయర్ జెట్ 60 విమానం ఒక్కసారిగా కూలిపోవడంతో అందులోని తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాద తీవ్రతకు విమాన శకలాలు సుదూర ప్రాంతాలకు ఎగిరిపడ్డాయి. అన్నా ఎస్కోబార్ అనే మహిళ ఇంటి పైకప్పును చీల్చుకుని వంటగదిలో పడిన లోహపు శకలాలు స్థానికులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశాయి.