స్వర్ణభారత్ ట్రస్ట్ వేడుకల్లో యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన విశ్రాంత అధికారులు
రిపోర్టర్: రాము
స్థలం: నెల్లూరు
వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాలకు విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకు విచ్చేసిన వీరు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయుడు, ప్రభాకర్‌రావు తదితరులు యోగికి తమ సేవా కార్యక్రమాలను వివరించి ఘనంగా సన్మానించారు.