ముథోల్‌లో వినాయక నిమజ్జనానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు

రిపోర్టర్: సునీల్ స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లా ముథోల్‌లో ఆదివారం జరగనున్న వినాయక నిమజ్జనం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బైంసా ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. శోభయాత్ర సాగే మార్గాలను సీఐ రవీందర్ నాయక్, ఎస్సై బిట్ల పెర్సిస్‌తో కలిసి ఆయన పరిశీలించారు. సుమారు 200 మంది పోలీసులతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, నిర్వాహకులు పోలీసులకు సహకరించి గడువులోగా నిమజ్జనం పూర్తి చేయాలని కోరారు.