రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న బీజేపీ నేత కునిగిరి నీలకంఠ
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
ఆదోని రూరల్ మండలంలో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతన్నలకు తక్షణమే పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.