రాష్ట్రంలో కలకలం: 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసిన ఎస్ఈసీ

రిపోర్టర్: రాము స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా పందొమ్మిది మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు తదుపరి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని భావించినట్లు ఎస్ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అభ్య్రధుల విజ్ఞప్తులు మరియు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వెల్లడైంది.