మహమ్మద్ షమీ అరుదైన బౌలర్ అంటూ మాజీ కోచ్ ప్రశంసలు
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
భారత పేసర్ మహమ్మద్ షమీ బౌలింగ్ శైలిపై మాజీ కోచ్ పరస్ మాంబ్రే ప్రశంసలు కురిపించారు. షమీకి ఉన్న అద్భుతమైన సీమ్ ప్రెజెంటేషన్ ప్రపంచంలోనే కొందరికే సాధ్యమని ఆయన తెలిపారు. జిమ్ లో గంటల తరబడి కష్టపడకుండా కేవలం నెట్స్ లో బౌలింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టే ఓల్డ్ స్కూల్ బౌలర్ అని, అందుకే అతను భారత్ లోనూ అత్యంత విజయవంతం కాగలిగాడని మాంబ్రే స్పష్టం చేశారు.